వైభవంగా శ్రీరామలీలా మహోత్సవం.. ముగిసిన శ్రీరామాయణ పారాయణం

భద్రాచలం, వెలుగు :  విజయదశమి సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శమీ పూజ, శ్రీరామలీలా మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామాయణ పారాయణ సమాప్తిని పురస్కరించుకుని శ్రీరామమహాపట్టాభిషేకాన్ని నిర్వహించారు. చివరి రోజున పూర్ణాహుతి చేశారు. ముందుగా స్వామికి నిత్య కల్యాణం జరిపాక సమస్త సముద్ర, నదీజలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రోక్షణ జలాలను భక్తులతో పాటు స్వామిపై అర్చకులు చల్లారు.

రామదాసు చేయించిన రాజదండం, రాజముద్రిక, గద స్వామికి సమర్పించి శిరస్సుపై కిరీటం అలంకరించి రామయ్యను పట్టాభిషిక్తున్ని చేశారు. సాయంత్రం భక్తుల జయజయధ్వానాలు, కోలాటాలు, వివిధ వేషధారణల నడుమ దసరా మండపానికి ఆయుధాలతో, రాజపరివారాలతో మహాచక్రవర్తి శ్రీసీతారామయ్య విజయోత్సవ యాత్రగా బయలుదేరారు. కూనవరం రోడ్డులోని దసరా మండపానికి చేరుకోగానే శ్రీసీతారామచంద్రస్వామికి మహారాజు అలంకారం చేసి మేళతాళాలతో శమీ పూజకు తీసుకొచ్చారు. సుదర్శనం, ఖడ్గం, ధనుస్సు, గద తదితర ఆయుధాలకు పూజలు చేసి ఉద్వాసన పలికారు.

చివరగా ఇంద్రుడు,యుముడు, వరుణుడు, కుబేరునకు ఆవాహన చేసి బాణాలు సంధించారు. జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి వాటిని భక్తుల శిరస్సుపై చల్లారు. తర్వాత శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించగా వందలాది మంది భక్తులు తిలకించారు. రావణాసుర బొమ్మపై బాణాన్ని సంధించారు. ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్​బాద్​ జిల్లా డోర్నకల్​కు చెందిన యశోదమ్మ అనే భక్తురాలు స్వామివారి  నిత్యాన్నదాన పథకానికి రూ.2లక్షలు విరాళంగా ఇచ్చారు. 

ఆయా ప్రాంతాల్లో.. 

భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ/ములకలపల్లి/తల్లాడ : ఉమ్మడి జిల్లాలోని యా ప్రాంతా