కోల్‌కతా, లక్నో సూపర్ ఏకపక్షంగా సాగింది.. మజా దొరకలేదని నిరుత్సాహ పడకండి. అసలు పోరు కాసేపట్లో మొదలు కాబోతోంది. ముంబై వాంఖడే వేదికగా చిరకాల ఐపీఎల్ ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా పతిరాణా
సీఎస్కే స్పీడ్ గన్ మతీష పతిరాణా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, చెన్నై తదుపరి మ్యాచ్ నాటికి కోలుకుంటాడని గురుంచి కొన్ని గంటల ముందు వరకూ వార్తలు వచ్చాయి. అలాంటిది అతడు అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: మతీషా పతిరణ, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, షేక్ రషీద్.
చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్
ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, నెహాల్ వధేరా, హార్విక్ దేశాయ్.