సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఓవైపు కెప్టెన్సీ మార్పు.. మరోవైపు వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు.. గెలుపు రుచి చూడాలన్న పట్టుదలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటోంది. మరోవైపు, ఢిల్లీ పరిస్థితి అంతే. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన డీసీ గెలుపే తమ లక్ష్యమంటోంది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన ముంబై ప్రధాన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో అందరి కళ్ళు అతని మీదనే ఉన్నాయి.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, పియూష్ చావ్లా, మహమ్మద్ నబీ, రోమారియో షెఫర్డ్, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్,లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్, జై రిచర్డ్ సన్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
🚨 Delhi Capitals opt to bowl at the Wankhede Stadium
— Cricbuzz (@cricbuzz) April 7, 2024
🏏 Suryakumar Yadav is BACK for MI
🏏 Mohammad Nabi, Romario Shepherd picked too
🏏 DC bring in Jhye Richardson and Kumar Kushagra (debut) #IPL2024 #MIvsDC pic.twitter.com/lAcp1QQfHQ