MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్‌కతా ఆలౌట్

MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్‌కతా ఆలౌట్

'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు..' అంతా అయిపోయాక ముంబై ఇండియన్స్ బౌలర్లు నిద్రలేచారు. అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాక తమ సత్తా ఏంటో చూపెట్టారు. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు విజృభించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కతాను పూర్తి ఓవర్లకు ఆడకుండానే ఆలౌట్ చేశారు. కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా  57 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్(5), సునీల్ నరైన్(8), శ్రేయస్‌ అయ్యర్‌(6), రఘువంశీ(13), రింకూ సింగ్(9).. ఇలా టాప్ ఐదుగురు 7 ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో వెంకటేష్ అయ్యర్(70), మనీష్ పాండే(42) జోడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 83 పరుగుల భారీ భాగస్వామ్యం అందించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. అయితే, చివరలో ముంబై బౌలర్లు మరోసారి విజృభించడంతో కోల్‌కతాకు కష్టాలు తప్పలేదు.

చివరలో ఆండ్రీ రస్సెల్(7) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. లేని పరుగు కోసం యత్నించి పెవిలియన్ చేరాడు. ఆపై రమణదీప్ సింగ్(2) సింగ్ సైతం స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, తుషార మూడేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకున్నాడు.