వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు విజృంభిస్తున్నారు. అంతా అయిపోయాక నిద్ర లేచినట్టు.. కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ 57 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్(5), సునీల్ నరైన్(8), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6), రఘువంశీ(13), రింకూ సింగ్(9) ఇప్పటికే పెవిలియన్ చేరారు.
బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. తుషార బౌలింగ్‌లో నాలుగో బంతికి భీకర ఫామ్‌లో ఉన్న సాల్ట్(5) వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(13)ని తుషార.. తన మరుసటి ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. కష్టాల్లో ఆదుకుంటాడనుకున్న అయ్యర్(6) సైతం అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో 28 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది.
ఆపై కొద్దిసేపటికే హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో నరైన్(8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తరువాత క్రీజులోకి వచ్చిన రింకు సింగ్(8) పీయూష్ చావ్లా చేతికి చిక్కాడు. అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 57 పరుగుల వద్ద కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్(13 నాటౌట్), మనీష్ పాండే(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
𝐔𝐏𝐑𝐎𝐎𝐓𝐄𝐃 🎯
— IndianPremierLeague (@IPL) May 3, 2024
Captain Hardik Pandya strengthens @mipaltan's hold with that wicket ☝️#KKR are 4 down now!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvKKR pic.twitter.com/zi75MZHZbl
KKR falling like pack of cards!
— OneCricket (@OneCricketApp) May 3, 2024
Half of the side back in the hut.
📸: Jio Cinema#IPL2024 #MIvsKKR pic.twitter.com/78A3kAaxCR