10 మ్యాచ్‌ల్లో.. 3 విజయాలు, 7 అపజయాలు.. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఐదుసార్లు టైటిల్ విజేత ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఇది. అనధికారికంగా వీరు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఏదో ఒక మూలాన వారిలో ఆశలు మిగిలే ఉన్నాయి. లీగ్ దశలో వారు ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. అవన్నీ గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించవచ్చు. ఇలాంటి సమయంలో వారు శుక్రవారం (మే 3) బలమైన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ ల్లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.. మంచి క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తామని ముంబై కెప్టెన్ తెలిపాడు. టోర్నీలో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్‍లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.
తుది జట్లు
ముంబై: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.
కోల్‌కతా: ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి.