MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!

MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!

ఐపీఎల్ పదిహేడో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ ఆడుతున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై సారథి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. 

ముంబై జట్టుకిది నామమాత్రపు మ్యాచ్ కాగా.. లక్నోకు కీలక మ్యాచ్. రాహుల్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా.. సాంకేతికంగా వారు ఇప్పటికీ పోటీలోనే ఉన్నారు. ముంబైపై 310 పరుగుల తేడాతో విజయం సాధిస్తే లక్నో ప్లే ఆఫ్ రేసులో ఉన్నట్లే. 

తుది జట్లు

ముంబై: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నెహాల్ వధేరా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార.

లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.