MI vs LSG: ఆ చిన్న మిస్టేక్ ముంబైకి శాపంగా మారింది.. లక్నోను నిలబెట్టింది..!

MI vs LSG: ఆ చిన్న మిస్టేక్ ముంబైకి శాపంగా మారింది.. లక్నోను నిలబెట్టింది..!

ముంబై12 రన్స్ తేడాతో లక్నో చేతిలో ఓటమి
కెప్టెన్ పాండ్యా, సూర్య, నమన్ పోరాటం వృథా
జెయింట్స్‌‌ను గెలిపించిన మార్ష్‌‌, మార్‌‌‌‌క్రమ్, దిగ్వేశ్‌

లక్నో: వరుసగా రెండు ఓటముల తర్వాత గత మ్యాచ్‌‌లో గెలుపు బాట పట్టిన ముంబై ఇండియన్స్ మళ్లీ బోల్తా కొట్టింది.  కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5/36; 16 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 28 నాటౌట్‌‌) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌‌తో మెప్పించినా.. ఛేజింగ్‌‌లో సూర్యకుమార్ యాదవ్ (43 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 67) దంచినా చివర్లో ఒత్తిడి జయించలేక విజయాన్ని వదులుకుంది. 

తమ హోమ్‌గ్రౌండ్‌లో తొలి పోరులో ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌‌  శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో 12 రన్స్‌‌   తేడాతో ముంబైని  ఓడించి రెండో విజయం అందుకుంది. తొలుత లక్నో 20 ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ (31 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60), ఐడెన్ మార్‌‌‌‌క్రమ్ (38 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53) ఫిఫ్టీలతో దంచికొట్టారు. అనంతరం  ఛేజింగ్‌‌లో ముంబై ఓవర్లన్నీ ఆడి 191/5 స్కోరు చేసి ఓడింది. సూర్యతో పాటు  నమన్ ధీర్ (24 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) పోరాడినా ఫలితం లేకపోయింది. మెరుగ్గా బౌలింగ్‌ చేసిన  దిగ్వేశ్ రాఠీ (1/21)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఓపెనర్ల ఫిఫ్టీలు.. పాండ్యాకు ఐదు వికెట్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన లక్నో స్టార్టింగ్‌‌ నుంచే దుమ్మురేపింది. సూపర్ ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌ మిచెల్ మార్ష్‌‌ మూడో ఫిఫ్టీ కొట్టాడు.  మార్‌‌‌‌క్రమ్‌‌తో తొలి వికెట్‌‌కు 76 రన్స్‌‌ జోడించి అద్భుత ఆరంభం అందించాడు. ఇన్నింగ్స్ మూడో బాల్‌‌నే బౌండ్రీ చేర్చిన మార్ష్‌‌.. దీపక్ చహర్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లతో అలరించాడు. బౌల్ట్‌‌ బౌలింగ్‌‌లో 6,4తో మరింత స్పీడు పెంచాడు. 

మరో ఎండ్‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌ స్ట్రయిక్ రొటేట్ చేయగా.. పవర్‌‌‌‌ప్లే ఎక్కువ బాల్స్‌‌ ఆడిన మార్ష్‌‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అశ్వని కుమార్ ఓవర్లో సిక్స్‌‌, మూడు ఫోర్లు సహా 23 రన్స్ పిండుకోవడంతో పవర్ ప్లేలో లక్నో 69/0తో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత బౌలింగ్‌‌కువ చ్చిన విగ్నేశ్ పుతుర్‌‌‌‌కు రిటర్న్‌‌ క్యాచ్ ఇచ్చి మార్ష్‌‌ ఔటవ్వడంతో ముంబైకి తొలి బ్రేక్ లభించింది. అదే ఓవర్లో సిక్స్‌‌తో మార్‌‌‌‌క్రమ్‌‌ స్పీడందుకోగా.. నికోలస్ పూరన్ (12) వచ్చీరాగానే ఫోర్‌‌‌‌, సిక్స్‌‌ కొట్టాడు. కానీ, 9వ ఓవర్లో బౌలింగ్‌‌కు దిగిన కెప్టెన్ హార్దిక్‌‌ పాండ్యా స్లో బౌన్సర్‌‌‌‌తో పూరన్‌‌ను వెనక్కుపంపాడు.

 ఓవైపు మార్‌‌‌‌క్రమ్‌‌ భారీ షాట్లతో ధాటిని కొనసాగించగా.. పాండ్యా వరుసగా వికెట్లు పడగొట్టాడు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (2)  పాండ్యా ఆఫ్​ కట్టర్‌‌‌‌కు మిడాఫ్‌‌లో క్యాచ్ ఇచ్చి మళ్లీ నిరాశపరిచాడు. ఈ దశలో ఆయుష్ బదోనీ (30) శాంట్నర్ వేసిన 14వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అశ్వని బౌలింగ్‌‌లో ఎక్స్‌‌ట్రా కవర్‌‌‌‌ మీదుగా మార్‌‌‌‌క్రమ్  సిక్స్‌‌ కొట్టగా.. ఓ బౌండ్రీ బాదిన బదోనీ తర్వాతి బాల్‌‌కే కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌‌కు 51 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత మార్‌‌‌‌క్రమ్‌‌.. పాండ్యా బౌలింగ్‌‌లో వెనుదిరిగాడు. అబ్దుల్ సమద్ (4) ఫెయిలైనా.. చివర్లో వేగంగా ఆడిన డేవిడ్ మిల్లర్ (27)  స్కోరు 200 దాటించాడు. 

స్పీడు సరిపోలే..

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. గాయంతో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌‌కు దూరంగా ఉండగా.. ఓపెనర్లు విల్‌‌ జాక్స్ (5), ర్యాన్ రికెల్టన్‌‌ (10)ను వరుస ఓవర్లలో ఆకాశ్‌‌ దీప్‌‌, శార్దూల్‌‌ ఔట్ చేసి లక్నోకు మంచి ఆరంభం అందించారు.  17/2తో కష్టాల్లో పడ్డ ఇన్నింగ్స్‌‌ను నమన్ ధీర్‌‌‌‌, సూర్య చక్కదిద్దారు. ఆకాశ్‌‌ దీప్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 6,6, 4, 4తో నమన్‌‌ స్టేడియాన్ని హోరెత్తించాడు. అవేశ్ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో సూర్య కూడా టచ్‌‌లోకి రాగా పవర్‌‌‌‌ ప్లేలో ముంబై 64/2 స్కోరు చేసింది. ఆకాశ్‌‌ను టార్గెట్‌‌ చేసి మరో రెండు ఫోర్లు కొట్టిన నమన్‌‌ను తొమ్మిదో ఓవర్లో దిగ్వేశ్‌‌ రాఠీ క్లీన్ బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌‌కు 69 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది. 

ఈ దశలో  ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌ తిలక్ వర్మ (23 బాల్స్‌‌లో 2 ఫోర్లతో 25) తోడుగా సూర్య తన జోరు కొనసాగించి స్కోరు వంద దాటించాడు.  తిలక్ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడినా సూర్య క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ ముంబైని రేసులో నిలిపాడు. .  చివరి నాలుగు ఓవర్లలో ముంబైకి 52 రన్స్ అవసరం అవగా.. అవేశ్ బౌలింగ్‌‌లో  షాట్‌‌కు ప్రయత్నించిన సూర్య ..సమద్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో హార్దిక్‌‌, తిలక్ చెరో ఫోర్ కొట్టారు. దిగ్వేశ్‌‌ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఫోర్ సహా 11  రన్స్ రాబట్టడంతో సమీకరణం 12 బాల్స్‌‌లో 29  రన్స్‌‌గా మారి ఉత్కంఠ మరింత  పెరిగింది. 

కానీ,19వ  ఓవర్లో శార్దూల్‌‌ తొలి ఐదు బాల్స్‌‌కు ఐదు సింగిల్స్ ఇచ్చాడు. షాట్లు ఆడలేకపోయిన తిలక్‌‌ రిటైర్డ్‌‌ ఔట్‌‌గా వెనుదిరగ్గా... ఆఖరి బాల్‌‌కు శాంట్నర్ (2 నాటౌట్‌‌) డబుల్ తీశాడు. చివరి ఓవర్లో ముంబైకి 22 రన్స్ అవసరం అవగా... అవేశ్‌‌ తొలి బాల్‌‌ను సిక్స్ కొట్టిన పాండ్యా ఆశలు రేపాడు. కానీ, తర్వాతి ఐదు బాల్స్‌‌లో అవేశ్‌ మూడు రన్సే ఇవ్వడంతో లక్నోనే విజయం వరించింది.

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 203/8 (మిచెల్ మార్ష్ 60, మార్‌‌‌‌క్రమ్ 53, హార్దిక్ 5/36)
ముంబై: 20  ఓవర్లలో 191/5 ( సూర్యకుమార్ 67, నమన్ 46, దిగ్వేశ్ రాఠీ 1/21).

30ఐపీఎల్‌‌లో పవర్ ప్లేలో 36 బాల్స్‌‌కు గాను 30 బాల్స్ ఆడిన తొలి బ్యాటర్‌‌గా మిచెల్  మార్ష్‌‌ రికార్డుకెక్కాడు.

100 లీగ్‌‌లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్య కుమార్‌‌‌‌కు ఇది వందో మ్యాచ్‌‌. ఆట ఆరంభానికి ముందు వంద నంబర్ ముద్రించిన ప్రత్యేక జెర్సీని ముంబై బ్యాటింగ్‌‌ కోచ్ పొలార్డ్‌‌ సూర్యకు అందించాడు.