ముంబై నిర్ధేశించిన 193 పరుగుల ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ఆదిలోనే తడబడుతున్నారు. ముంబై పేసర్లు గెరాల్డ్ కొయెట్జీ, జస్ప్రీత్ బుమ్రాలను ఎదుర్కొలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఇన్నింగ్స్ మొదలై మొదటి 13 బంతుల్లోనే పంజాబ్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. వీరి ఆట చూస్తుంటే.. గెలుపు సంగతి దేవుడెరుగు 120 బంతులు ఆడట మూ కష్టంగా కనిపిస్తోంది.
కొయెట్జీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0) పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్ లో నే బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. సూపర్ యార్కర్‌తో నాలుగో బంతికి రిలీ రొసోవ్ (1)ను బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి సామ్ కరన్ (6)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం కొయెట్జీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి బౌలర్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి లివింగ్‌స్టన్ (1) వెనుదిరిగాడు. దీంతో 14 పరుగులకే పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది.