ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 1) మరో కీలక సమరం జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో బోణీ కొట్టని ముంబై ఇండియన్స్.. వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.. ఈ విషయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మెచ్చుకోవాల్సిందే. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అండర్ -19 బౌలర్ మఫాకాకు మరో అవకాశమిచ్చాడు.
ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూసింది లేదు. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలయ్యింది. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోరు మీదుంది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రే బర్గర్, అవేష్ ఖాన్.