MI vs SRH: కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గట్టెక్కిన సన్‌రైజర్స్

MI vs SRH: కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గట్టెక్కిన సన్‌రైజర్స్

250పైచిలుకు స్కోర్లను అలవోకగా నిర్దేశిస్తూ వచ్చిన.. సన్ రైజర్స్  బ్యాటర్లు కీలక సమయంలో తడబడుతున్నారు. గత మ్యాచ్‌ల్లో కనిపించిన తెగింపు, ధైర్యం మన వారిలో కొరవడింది. దూకుడుగా అదితే.. ఎక్కడ ఔట్ అవుతామో అన్న భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే మన వారిని దెబ్బతీసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంజ్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్లు అభిషేక్ శర్మ(11), ట్రావిస్ హెడ్(48)లు శుభారంభ‌మిచ్చారు. బుమ్రా, తుషార‌లు క‌ట్టుదిట్టంగా బంతులేసైనా వికెట్ చేజారనివ్వలేదు. అన్షుల్ కాంబోజ్ వేసిన ఐదో ఓవ‌ర్లో హెడ్ బౌల్డయినా.. అది నో బాల్ కావ‌డంతో ఊపిరి పీల్చుకున్నాడు. బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్ వెనుదిరిగాడు. అక్కడినుంచి ఆరంజ్ ఆర్మీ వికెట్లు కోల్పోతూనే వచ్చింది.

మయాంక్ అగర్వాల్ (5), ట్రావిస్ హెడ్ (45), నితీశ్ రెడ్డి (20), హెన్రిచ్ క్లాసెన్ (2) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.  దాంతో, వందలోపే సన్ రైజర్స్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత టెయిలెండ‌ర్లు తలా ఓచేయి వేసి జట్టును ఆదుకున్నారు. ష‌హ్‌బాజ్ అహ్మద్(10), మార్కో జాన్‌సెన్(17), పాట్ కమ్మిన్స్( 17 బంతుల్లో 35 నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.