Viral: తమిళనాడులో మియా ఖలీఫా.. ఫొటోలు వైరల్..!

మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆ ఫొటో మనోభావాలు దెబ్బతీసేలా ఉండటంతో పోలీసులకు కొందరు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ మాప్పిళ్లై వినాయగర్ టెంపుల్ కాంప్లెక్స్లో నాగత్తమ్మన్, చెల్లియమ్మన్ అమ్మవార్ల సంబురాలు జరిగాయి.

ప్రతీ సంవత్సరం ఈ వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవార్ల సంబురంలో పాలుపంచుకునే భక్తులను ఆహ్వానిస్తూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో ఒక ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరిని అవాక్కయ్యేలా చేసింది. మియా ఖలీఫా  భారతీయ వస్త్రధారణలో తలపై కలశం పెట్టుకున్న ఫొటో ఆ ఫ్లెక్సీలో కనిపించమే అందుకు కారణం. ఈ ఫ్లెక్సీని స్థానికంగా ఉన్న కొందరు టీనేజర్లు ఏర్పాటు చేశారు. 

ఆ టీనేజర్ల ఫొటోలు కూడా క్రియేటివ్గా ఆధార్ కార్డు ధీమ్లో కనిపించడం మరో ట్విస్ట్. ఈ ఫ్లె్క్సీని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. పోలీసులకు విషయం తెలిసి భక్తుల మనోభావాల దెబ్బతినేలా ఆ ఫ్లెక్సీ ఉందని తీయించేశారు. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీనేజర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవడం కోసం ఇలా ఇతరుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.