
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. శనివారం (మార్చి 22) గ్రాండ్ గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. ఈ సారి మెగా ఆక్షన్ జరగడంతో అన్ని జట్లు ఎక్కువగా కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగబోతుంది. మొత్తం 10 జట్లు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. రానున్న సీజన్ లో టైటిల్ విజేతను అంచనా వేయడం చాలా కష్టం.
బలమైన జట్టు, బలహీనమైన జట్టు అంటూ ఏమీ లేవు. అన్ని జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పాటు బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి. అంతేకాదు ప్రతి జట్టు టైటిల్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. ఐపీఎల్ లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ప్రారంభం కాకుండానే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ టైటిల్ విజేత ఎవరో జోస్యం చెప్పాడు. బియాండ్ 23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుందో చెప్పాడు. హోస్ట్ ఎరిన్ హాలండ్ అడిగిన ప్రశ్నకు క్లార్క్ ఎలాంటి సందేహం లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలుస్తుందని చెప్పాడు.
సన్ రైజర్స్ అన్ని విధాలుగా ముందుకు సాగగల జట్టని.. తన ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేదని క్లార్క్ తెలిపాడు. కెప్టెన్ గా ప్యాటీ గత సంవత్సరం చాలా నేర్చుకునేవాడని.. ఈ సంవత్సరం అతని కెప్టెన్సీ ఇంకా మెరుగుపడుతుందని క్లార్క్ అన్నాడు. కీలక సమయాల్లో కమ్మిన్స్ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటాడని.. జట్టును ముందుండి నడిపిస్తాడని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ లో అత్యంత పటిష్టంగా కనిపిస్తుందని.. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా ఉందని ఈ క్లార్క్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా ప్లేయర్ కావడంతోనే క్లార్క్ ఇలా చెప్పి ఉంటాడని నెటిజన్స్ భావిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:
హెన్రిచ్ క్లాసెన్: రూ. 23 కోట్లు (దక్షిణాఫ్రికా, బ్యాటర్/ వికెట్ కీపర్)
పాట్ కమిన్స్: రూ. 18 కోట్లు (కెప్టెన్, ఆస్ట్రేలియా బౌలర్)
అభిషేక్ శర్మ: రూ. 14 కోట్లు
ట్రావిస్ హెడ్: రూ. 14 కోట్లు (ఆస్ట్రేలియా బ్యాటర్)
నితీష్ కుమార్ రెడ్డి: రూ.6 కోట్లు
కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లు
మహ్మద్ షమీ: రూ.10 కోట్లు
హర్షల్ పటేల్: రూ.8 కోట్లు
ఇషాన్ కిషన్: 11.25 కోట్లు
రాహుల్ చాహర్: 3.2 కోట్లు
ఆడమ్ జంపా: రూ.2.4 కోట్లు (ఆస్ట్రేలియా స్పిన్నర్)
అథర్వ తైదే: రూ.30 లక్షలు
అభినవ్ మనోహర్: రూ.3.2 కోట్లు
సిమర్‌జీత్ సింగ్: రూ.1.5 కోట్లు
జీషన్ అన్సారీ: రూ. 40 లక్షలు
జయదేవ్ ఉనద్కత్: కోటి రూపాయలు
బ్రైడన్ కార్సే.. కోటి రూపాయలు (ఇంగ్లండ్ బౌలర్)
కమిందు మెండిస్: రూ. 75 లక్షలు (శ్రీలంక ఆల్ రౌండర్)
అనికేత్ వర్మ: రూ. 30 లక్షలు
ఎషాన్ మలింగ: రూ.1.2 కోట్లు (శ్రీలంక బౌలర్)
సచిన్ బేబీ: రూ. 30 లక్షలు