వేలంలో మైఖెల్ జోర్డాన్  షూస్.. ధర ఎంతటే?

వేలంలో మైఖెల్ జోర్డాన్  షూస్.. ధర ఎంతటే?

బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖెల్ జోర్డాన్ గురించి తెలియని వారుండరు. ఈయనను MJ అని కుడా పిలుస్తారు. ఇతను అమెరికన్ వ్యాపారవేత్త, ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ఆటగాడు.  ఆట యొక్క అత్యుత్తమ డిఫెన్సివ్ ప్లేయర్‌లలో ఒకరిగా ఖ్యాతిని పొందుతూ తన అద్భుతమైన స్కోరింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. స్లామ్ డంక్ పోటీలలో ఫ్రీ-త్రో లైన్ నుండి స్లామ్ డంక్ లను ప్రదర్శించడం ద్వారా ఇతనికి ఎయిర్ జోర్డాన్, హిస్ ఎయిర్ నెస్ అనే పేర్లు వచ్చాయి.

కాగా, మైఖెల్ జోర్డాన్ ధరించిన షూస్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికాయి. ప్రముఖ ఎయిర్ జోర్డాన్ బ్రాండుకు చెందిన ఈ షూస్ కు చాలా ప్రాముఖ్యత లేకపోలేదు. ఈ షూస్ తోనే అనేక టైటిళ్లు గెలిచారు. అయితే తాజాగా ఈయన 1980 ఎన్బీఏ ఫైనల్ లో ధరించిన షూస్ కు వేలంలో ఉంచారు. ఇందులో ఆరు జతల స్నీకర్స్ ఉన్నాయి. ఇవి వేలంలో 66.6 కోట్లు పలికాయి.