అంతర్జాతీయ క్రికెట్ లో పసికూన ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇటీవలే నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ 33 బంతుల్లో సెంచరీ చేసి టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. తాజాగా మెరుపు సెంచరీతో నెదర్లాండ్స్ బ్యాటర్ సంచలనం సృష్టించాడు. ఓపెనర్ లెవిట్ 49 బంతుల్లోనే సెంచరీ చేసి నెదర్లాండ్స్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.
నేపాల్ ట్రై సిరీస్ లో భాగంగా నేడు నెదర్లాండ్స్, నమీబియాల మధ్య మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఓపెనర్ లెవిట్ 62 బంతుల్లో 135 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం రెండో టీ20 మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ఈ డచ్ ఓపెనర్ ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో నెదర్లాండ్స్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ చేసిన 133 పరుగుల రికార్డ్ ను తాజాగా లెవిట్ బ్రేక్ చేసాడు.
ALSO READ :- James Anderson: నా సక్సెస్ క్రెడిట్ ఆ భారత బౌలర్‌కే దక్కుతుంది: జేమ్స్ అండర్సన్
లెవిట్ విధ్వంసంతో ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. లెవిట్(135) భారీ సెంచరీకి తోడు సైబ్రాండ్ (75) హాఫ్ సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో నమీబియా 7 వికెట్లను 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రీన్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Netherlands' Michael Levitt becomes the third youngest in men's cricket to smash a T20I century. pic.twitter.com/3lhXG9l8ZH
— CricTracker (@Cricketracker) February 29, 2024