AUS vs IND: ఆస్ట్రేలియా మాత్రమే ఇండియాను ఓడించగలదు: రోహిత్ సేనకు ఇంగ్లాండ్ దిగ్గజం వార్నింగ్

AUS vs IND: ఆస్ట్రేలియా మాత్రమే ఇండియాను ఓడించగలదు: రోహిత్ సేనకు ఇంగ్లాండ్ దిగ్గజం వార్నింగ్

ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ఇక నాకౌట్ సమరం మాత్రమే మిగిలి ఉంది. మొత్తం రెండు సెమీ ఫైనల్.. ఒక ఫైనల్ తో పాటు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం (మార్చి 4) జరగబోయే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఐసీసీ నాకౌట్స్ లో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చికోవాలని భారత్ భావిస్తుంటే.. ఇండియాపై ఉన్న అద్భుతమైన రికార్డ్ ఆస్ట్రేలియా కొనసాగించాలని భావిస్తుంది. ఈ బ్లాక్ బస్టర్ సెమీ ఫైనల్ గురించి  మైఖేల్ వాన్ మాట్లాడాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ కు ముందు ఇండియాకు ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ వాన్ హెచ్చరికలు పంపాడు. నాకౌట్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. " భారత్ ను ఎవరు ఓడిస్తే వారు టైటిల్ గెలుచుకుంటారు. చాలా సింపుల్. టీమిండియాను ఓడించే సత్తా ఆస్ట్రేలియాకు మాత్రమే ఉంటుంది. కానీ దుబాయ్ పిచ్ లకు అలవాటు పడిన భారత్ ను ఓడించాలంటే చాలా కష్టం". అని వార్న్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. చివరిసారిగా 2015 వన్డే వరల్డ్ కప్ లో భారత్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ ల్లో తలపడ్డాయి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తు చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. 

Also Raed : పోయిన చోటే వెతుక్కున్నాడు: నాలుగేళ్ల తర్వాత విమర్శకులకు వరుణ్ చక్రవర్తి చెక్

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో మ్యాచ్ లు ముగిశాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకోగా.. గ్రూప్ బి నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. మంగళవారం (మార్చి 4) భారత్, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్ వేదికగా తొలి సెమీ ఫైనల్లో తలపడనున్నాయి. సెకండ్ సెమీ ఫైనల్ లాహోర్ వేదికగా మ్యాచ్ మార్చి 5న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. ఈ సెమీ ఫైనల్ మ్యాచుల్లో ప్రత్యర్థులను ఓడించిన రెండు జట్లు మార్చి 9న ఆదివారం రోజున జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టైటిల్ కోసం తలపడతాయి.