ఇవాళ నేను గడ్డం గీయించుకున్నా.. అని ఎవరైనా అడగకుండానే చెప్తారా..! చెప్పరు. మరి, ఇతను చెప్పారు అంటే.. అందులో ఏదో విషయం దాగున్నట్లే కదా..! తానొక అంతర్జాతీయ క్రికెటర్.. గొప్ప పేరున్న నాయకుడు.. అటువంటి ఒకప్పటి ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోడ్డుపక్కన గడ్డం గీయించుకున్నారు. అదీ ముంబై రోడ్లపై.. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించారు. పైగా గడ్డం గీయించుకుంటున్న దృశ్యాలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ ముంబైలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో గడ్డం గీయించుకున్నారు. ముంబైలోని ఓర్మిన్‌స్టన్ రోడ్డులో ఉన్న తన స్నేహితుడు (దిండయాల్(బార్బర్ నేమ్) చేత షేవ్ చేయించుకున్నాని అతనే ఓ క్లిప్‌ను తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. గతేడాది వన్డే ప్రపంచ కప్ సమయంలోనూ వాన్.. ఇక్కడే షేవ్ చేపించుకున్నారు. దీంతో మరోసారి తన మిత్రుడిని కలిసి భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు.
He’s back .. Dindayal on Orminston Rd #Mumbai .. been away at his daughters wedding and now returns .. #India pic.twitter.com/qKe0RgP5t1
— Michael Vaughan (@MichaelVaughan) April 8, 2024
Monday is shaving day on the Orminston Road with my good friend Dinjayal .. #Mumbai pic.twitter.com/HaEjq8RLXY
— Michael Vaughan (@MichaelVaughan) November 13, 2023
ఐపీఎల్ 2024 కామెంటేటర్
వాన్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో కామెంటేటర్ గా ఉన్నారు. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్, దీప్ దాస్‌గుప్తా, మురళీ కార్తిక్ వంటి ఇతర వ్యాఖ్యాతలతో కలిసి తన కామెంటరీ వినిపిస్తున్నారు. వాన్ ఇంగ్లాండ్ జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా పనిచేశారు. ఇంగ్లండ్ మొదటి టీ20 కెప్టెన్.. అతను. 2003 నుండి 2008 వరకూ టెస్ట్ జట్టుకు, 2003 నుండి 2007 వరకు వన్డేలకు, 2005 నుండి 2007 వరకు టీ20లకు సారథ్యం వహించారు.