పాకిస్థాన్ టీం డైరెక్టర్ మిక్కీ ఆర్ధర్ బీసీసీఐ, టీమిండియాపై ఎప్పుడు అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. భారత్ పై మ్యాచ్ గెలవలేక మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ వరల్డ్ కప్ లో ఇది ఐసీసీ టోర్నీలా లేదు.. బీసీసీఐ టోర్నీలా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటడంతో ఓర్వలేని మిక్కీ ఆర్ధర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
"ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో వన్డేల్లో భారత ఆటగాళ్లే టాప్ లో ఉన్నారు. ఈ ర్యాంకులు ఐసీసీ ప్రకటించినట్లుగా లేవు. బీసీసీఐ ప్రకటించిన ర్యాంకులుగా నాకు అనిపిస్తున్నాయి " అని చెప్పుకొచ్చాడు. మొన్నటివరకు వన్డే ర్యాంకింగ్స్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టాప్ ర్యాంక్ లో ఉంటే.. పేసర్ షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. తాజాగా వీరిద్దరిని పక్కకు నెట్టి బ్యాటింగ్ లో శుభమన్ గిల్ అగ్ర స్థానానికి చేరుకుంటే.. బౌలింగ్ లో భారత పేసర్ సిరాజ్ టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు.
Also Read :- రాత్రి 8 గంటల నుంచి సెమీస్, ఫైనల్ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి
నిన్నటివరకు పాక్ ఆటగాళ్లు టాప్ స్థానాల్లో ఉంటే ప్రశించని మిక్కీ ఆర్ధర్.. భారత ఆటగాళ్లు అగ్ర స్థానానికి దూసుకెళ్లడంతో మరోసారి తన చెత్త బుద్ధి బయట పెట్టాడు. బ్యాటింగ్ లో గిల్ తో పాటు విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, కోహ్లీ ఆరో స్థానంలో నిలిచారు. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 4, బుమ్రా 8, షమీ 10 వ స్థానంలో నిలిచారు. ఇక మూడు ఫార్మాట్ లలో టీమిండియా నెంబర్ వన్ గా కొనసాగుతుంది.