బుల్లి వయొలిన్ తో గిన్నిస్ రికార్డు

  • 0.74 మిల్లీ గ్రాముల బంగారంతో తయారీ
  • వరంగల్ కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్ ఘనత

మట్టెవాడ అజయ్ కుమార్. వరంగల్ కుచెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్. తరచూ రికార్డులు సృష్టించడం ఆయన పని. ఇప్పుడు మరోసారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఈ సారి 0.74 మిల్లీ గ్రాముల బంగారంతో మైక్రోవయొలిన్ తయారు చేసి రికార్డు సాధించారు. అదీ మామూలుగా కాదు బంగారంతో. అంతేనా.. అంటే ఇంకా ఉంది. ఆ వయోలిన్ పొడవు 20 మిల్లీమీటర్లు. వాటికి అతి చిన్న ఇనుప తీగలు అమర్చారు. వయొలిన్ వాయించేం దుకు బంగారంతోనే  ఓ‘బో’ను కూడా తయారు చేశారు. అదేదో బొమ్మ వయొలిన్ మాదిరి కాకుండా.. సంగీతం వినిపించేలా రూపొందిం చారు.  0.18 మిల్లీగ్రాముల బంగారంతో కత్తెర తయారు చేశారు అజయ్. దీంతో చిన్న పేపర్లు నీట్ గా కట్ చేయొచ్చట. 29 ఏళ్లుగా ‘మైక్రో ఆర్ట్’లో ఉన్నానని 45 ఏళ్ల అజయ్ చెప్పారు. వయొలిన్  తయారు చేసేందుకు 11 గంటలు, కత్తెర పూర్తి చేసేందుకు 3 గంటలు పట్టిం దన్నారు . 2004లో తొలిసారిగా లిమ్కా రికార్డు సాధించానని చెప్పారు. గతంలో సూది రంధ్రంలో ‘దండి యాత్ర’ను చూపి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.  ప్రపంచంలో సూది రంధ్రంలో పట్టేంత అతిచిన్న విగ్రహాలు చేసిన మూడో మైక్రో ఆర్టిస్ట్ అజయ్.