ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రస్తుతం టెక్ రంగంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏఐ వినియోగించి అధిక ప్రయోజనాలు, లాభాలు పొందేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం లేకుండా ముందుకు సాగలేమని తెలుసుకున్న కంపెనీలు..తమ సంస్థ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కంటెంట్ కోసం వెతుకుతున్నాయి. ఎంత ఖర్చయినా పర్వాలేదు అని ముందుకు సాగుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్మించేందుకు కంటెంట్ కోసం మైక్రోసాఫ్ట్, గూగుల్ పోటీపడుతున్నాయి. టెక్ దిగ్గజాలు కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కంటెంట్ కోసం పోటీ పడుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారీ మొత్తంలో వెచ్చింది కంటెంట్‌ను గూగుల్ లాక్ చేస్తోందని ఆరోపించారు సత్య నాదెళ్ల.
సెర్చింగ్ లో దిగ్గజం..వ్యాపార ప్రకటన మార్కెట్ లో భారీ హిట్టర్ గా లాభాలను ఆర్జిస్తోంది. సాఫ్ట్‌వేర్‌కు శిక్షణ ఇవ్వడానికి కృత్రిమ మేధస్సును నిర్మించడం కంప్యూటింగ్ పవర్ లేదా సర్వర్లు, డేటాను తీసుకుంటుందని నాదెళ్ల చెప్పారు. కానీ ఇది గూగుల్ పేరుతో కాకుండా ఇతర కంపెనీలు పెద్ద కంటెంట్ తయారీదారులతో ప్రత్యేకమైన ఒప్పందాలను లాక్ చేస్తోందట. అంటే దీన్ని బట్టి టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్, అవసరం ఎంత ఉందో అర్థమవుతోంది.