- భారత సంతతి బాసులు గ్రేట్..
- మోస్ట్ ఇన్ఫ్లూయెన్షనల్ గ్లోబల్ లీడర్స్గా గుర్తింపు
- లిస్టులో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యూట్యూబ్ నీల్ మోహన్ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షనల్ గ్లోబల్ లీడర్స్గా గుర్తింపు సాధించారు. హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ జాబితా 2024 ప్రకారం, చానెల్ గ్లోబల్ సీఈఓ అయిన లీనా నాయర్ కూడా భారత సంతతికి చెందిన చెందిన అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరు.
గ్లోబల్ ఇండియన్స్ నాయకత్వంలోని కంపెనీల మొత్తం విలువ 10 ట్రిలియన్ డాలర్లు ఉంది. జాబితాలోని మొత్తం విలువలో టాప్ 10 వ్యక్తుల వాటా దాదాపు 73 శాతం ఉంది. వీరితోపాటు నేహా నార్ఖేడే (కన్ఫ్లూయెంట్), అంజలి సూద్ (ట్యూబి ఓటీటీ), యామినీ రంగన్ (హబ్‌స్పాట్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్), లీనా నాయర్ (చానెల్) రేవతి అద్వైతి (ఫ్లెక్స్) 436 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు.-