ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ అన్నది మాములు విషయం అయిపోయింది.. మొన్నటి దాకా లేఆఫ్స్ గురించి భయపడ్డ ఉద్యోగులు ఇప్పుడు రేపో మాపో తమ వంతు కూడా వస్తుంది అన్న వైరాగ్యంలో పడిపోయారు. దిగ్గజ సంస్థలు కూడా కాస్ట్ కటింగ్ పేరిట పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత కోస్తున్నాయి. అయితే..వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ కూడా లేఆఫ్స్ కి ప్రధాన కారణమని చెప్పచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారీ లేఆఫ్స్ కాకపోయినా పెర్ఫార్మన్స్ పేరిట కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది.
Also Read : జాబ్ చేసే మహిళల కోసం బెంగళూరు
సుమారు 2లక్షల 28వేల మంది ఉద్యోగులు ఉన్న మైక్రోసాఫ్ట్ లో ప్రస్తుతం పెర్ఫార్మన్స్ ఎన్ని ఉద్యోగాలు తీసేస్తున్నారన్న అంశంపై అధికారిక సమాచారం లేదు. ఈ ఉద్యోగాల కోత వల్ల మైక్రోసాఫ్ట్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం లేదని.. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 38శాతం మార్జిన్ సొంతం చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. అయితే.. గతేడాది 29శాతం ఉన్న స్టాక్ పర్ఫామెన్స్ ఈ ఏడాది మాత్రం 12 శాతానికే పరిమితమైనట్లు తెలిపింది మైక్రోసాఫ్ట్.