Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 36 విమానాలు రద్దు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 36 విమానాలు రద్దు

Microsoft Crisis: మైక్రోసాఫ్ట్ లో ఏర్పడ్డ...సాంకేతిక సమస్యతో దేశంలోని పలు ఎయిర్ పోర్టుల్లో ఇంకా విమానాలు ఆలస్యంగానే నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లో టెక్ని కల్ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, విశాఖ వంటి ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టుల సేవలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

శంషాబాద్ ఎయిర్ట్ లోనూ సమస్య ఇంకా అలానే ఉంది. మొత్తం 36 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే మూడు ఫ్లైట్లు, పూణే వెళ్లే రెండు ఫ్లైట్లు, ఢిల్లీకి వెళ్లే రెండు ఫ్లైట్స్, గోవాకి వెళ్లే ఒక ఫ్లైట్, ముంబైకి వెళ్లే మూడు ఫ్లైట్స్, బెంగుళూరు వెళ్లే ఒక ఫ్లైట్, వైజాగ్ కి వెళ్లే రెండు ఫ్లైట్స్ తో పాటు పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు. 

నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్11,10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. అనేక దేశాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. విమాన, బ్యాంకింగ్ సహా పలు సేవలకు బ్రేక్ పడింది. ఆన్ లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ కు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో సమస్యలు తలెత్తాయి.