హైదరాబాద్​లో  మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్

హైదరాబాద్, వెలుగు:  అమెరికా టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్​లో భారీ డేటా సెంటర్​ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రాబోయే 15 ఏళ్లలో రూ. 15వేల  కోట్ల పెట్టుబడి పెట్టనుంది.   ముంబై, పుణె,  చెన్నై తర్వాత దేశంలో మైక్రోసాఫ్ట్​కు ఇది నాలుగో డేటా సెంటర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త డేటా సెంటర్ ఈ  రీజియన్​లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కెపాసిటీని మరింత పెంచుతుందని చెప్పారు. ఈ డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమెరికాలోని రెడ్​మండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డేటాసెంటర్‌‌‌‌‌‌‌‌ కంటే పెద్దది అవుతుందన్నారు. డేటా సెంటర్ రీజియన్.. క్లౌడ్, డేటా సోలిటన్‌‌‌‌‌‌‌‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రొడక్టివిటీ టూల్స్, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, డెవలపర్లు, విద్య,  ప్రభుత్వ సంస్థల కోసం అధునాతన డేటా భద్రతతో కస్టమర్ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో మొత్తం మైక్రోసాఫ్ట్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను అందిస్తుందని చెప్పారు. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 160 డేటా సెంటర్లు, 60 డేటా సెంటర్ రీజియన్లు ఉన్నాయని, హైదరాబాద్ డేటా సెంటర్ మొదటిదశ 2025 నాటికి పూర్తవుతుందని చెప్పారు.  ఐడీసీ రిపోర్టు ప్రకారం ఇప్పటికే మన దేశంలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా  సెంటర్లు 2016– 2020 మధ్య మన ఎకానమీకి 9.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని అందించాయి. దాదాపు 1.69 లక్షల న్యూ స్కిల్డ్ ఐటీ జాబ్స్​తోపాటు 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ డేటా సెంటర్​ కోసం కంపెనీ రూ.275 కోట్ల విలువైన భూములను కొన్నది. మేకగూడలో రూ.22 కోట్ల విలువైన జాగాను, షాద్​నగర్​లో రూ.164 కోట్ల విలువైన 41 ఎకరాల భూమిని, చందనవెల్లిలో రూ.72 కోట్ల విలువైన 52 ఎకరాల భూమిని కొన్నది.
ఇండియాను గ్లోబల్​ డేటా సెంటర్ హబ్​గా మార్చుతాం: మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, స్కిల్ డెవెలప్​మెంట్​శాఖల సహాయమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఇండియాను గ్లోబల్ డేటా సెంటర్ హబ్​గా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని చెప్పారు.  తమ ప్రభుత్వం స్టార్టప్, డిజిటల్ ఎకానమీని పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోందని అన్నారు. డిజిటల్ ఎకోసిస్టమ్​కు డేటా సెంటర్లు కీలకమని మంత్రి చెప్పారు.  మనదేశంలో స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు,  యూనికార్న్‌‌‌‌‌‌‌‌ల సంఖ్య పెరగడంపై మాట్లాడుతూ, ఇండియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టార్టప్ ఎకో సిస్టమ్​గా ఎదిగిందని వివరించారు. డిజిటలైజేషన్ వల్ల ఏర్పడే అవకాశాలను దక్కించుకోవడానికి వెయ్యి రోజుల విజన్ ప్లాన్ ప్రకారం పని చేస్తున్నామని ప్రకటించారు. నేషనల్ డేటా సెంటర్ పాలసీ కోసం సంబంధిత పక్షాలతో చర్చిస్తున్నామని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

 తెలంగాణలో రెండో అతిపెద్ద ఎఫ్​డీఐ ఇదే: కేటీఆర్​

మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర ఎకానమీకి ఎంతో మేలు జరుగుతుందని ఐటీ, ఇండస్ట్రీస్​శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడిలో ఇది రెండో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్​ అన్నారు.  మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌‌‌‌‌‌మెంట్ సెంటర్ (ఐడిసి)లో తొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉన్నారని, రాబోయే డేటాసెంటర్ వల్ల ఐటీ ఆపరేషన్స్, ఫెసిలిటీస్ మేనేజ్​మెంట్, డేటా అండ్ నెట్​వర్క్​ సెక్యూరిటీ, నెట్​వర్క్​ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్​కు అవకాశాలు వస్తాయని చెప్పారు.