
ఇద్దరు లెజెండ్స్ ఒకచోట చేరితే ఎలా ఉంటుంది.. ఒకరు క్రికెట్.. ఇంకొకరు టెక్నాలజీ.. ఇద్దరూ హిస్టరీ క్రియేట్ చేసినవారే. ఈ ఇద్దరూ కలిసి ఏదో పెద్ద బిజినెస్ డీల్ కోసం కూర్చున్నట్లుగా.. దానికి ముందు సరదాగా ముంబై రుచులను చవిచూసినట్లుగా ఒక వీడియో రిలీజ్ చేశారు.
ఇటీవల ఇండియాకు వచ్చిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. శుక్రవారం (మార్చి 21) సచిన్ టెండూల్కర్ ను కలిశాడు. రాకరాక వచ్చిన అతిథికి మర్యాదలు చేసే క్రమంలో లోకల్ ఫేమస్ వడాపావ్ టేస్ట్ చేయించాడు సచిన్. ఇద్దరూ కలిసి అలాగా రిలాక్స్డ్ గా బెంచ్ మీద కూర్చుని వడాపావ్ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఇన్ స్టా లో షేర్ చేశాడు గేట్స్.
ALSO READ | షాకింగ్ కేసు..సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం..రాజ్యసభ చైర్మన్
అయితే త్వరలో జరబగబోయే డీల్ కు సంబంధించి ఇది ఏదో టీజర్ లాంటిదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. వీడియో ఎండింగ్ లో ‘‘సర్వింగ్ సూన్’’ అనే క్యాప్షన్ తో ఎండ్ చేశారు. అంటే త్వరలో ఏదో బిగ్ న్యూస్ ఈ ఇద్దరు లెజెండ్స్ నుంచి వినే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి సచిన్, గేట్స్ లలో ఏ ఒక్కరూ డీటెయిల్స్ షేర్ చేయలేదు.
బిల్ గేట్స్ మాత్రం ఇంకొంత సమాచారం సూచాయగా చెప్పాడు. ‘‘పనికి వెళ్లే ముందు స్నాక్స్ బ్రేక్’’ (A snack break before we get to work) అని క్యాప్షన్ ఇచ్చాడు.
బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ 25వ యానివర్సరీ సందర్భంగా ఇండియా వచ్చిన బిల్ గేట్స్.. ప్రముఖులతో భేటీ అవుతున్నారు. భారత్ లో టెక్నాలజీకి ఉన్న అవకాశంపై చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి జై శంకర్ తదితరులను ఇప్పటికే కలిసి పలు అంశాలపై చర్చించారు. అదే విధంగా పలు విశ్వవిద్యాలయాలను కూడా సందర్శించారు. తాజాగా సచిన్ తో కలవడంతో.. వీరి కాంబోలో ఏదో బిగ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.