స్టార్టప్​ల కోసం మైక్రోసాఫ్ట్​ ఫౌండర్స్​ హబ్

స్టార్టప్​ల కోసం మైక్రోసాఫ్ట్​ ఫౌండర్స్​ హబ్

న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్‌ల కోసం ఫౌండర్స్​హబ్‌ను  మైక్రోసాఫ్ట్​ గురువారం లాంచ్​ చేసింది. స్టార్టప్​ జర్నీలో ఫౌండర్లకు ప్రతీ స్టేజ్​లోనూ ఈ ప్లాట్​ఫామ్​ అండగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్​ తెలిపింది. తాను, తన భాగస్వాముల నుంచి 3 లక్షల డాలర్ల విలువైన బెనిఫిట్లు, క్రెడిట్లు, ఫ్రీ టెక్నాలజీ, టూల్స్​, రిసోర్సెస్​ వంటివి ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్​ లెర్న్​తోపాటు, ఇతర స్కిల్లింగ్​ ఆపర్చునిటీస్​, మెంటార్‌‌షిప్​ కూడా ప్లాట్​ఫామ్​ అందిస్తుందని మైక్రోసాఫ్ట్​ వెల్లడించింది. ఇండియాలోని స్టార్టప్స్​ చాలా ఇనొవేటివ్​ ఐడియాలతో దూసుకెళ్తూ దేశాన్ని లీడింగ్​ స్టార్టప్స్​ హబ్​గా నిలుపుతున్నాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. వందలాది మంది స్టార్టప్​ ఫౌండర్లతో డిస్కస్​ చేశాకే ఫౌండర్స్​ హబ్​ ప్లాట్​ఫామ్​ అందుబాటులోకి తెచ్చామని ప్రకటించింది.