ఉద్యోగులకు నచ్చిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ టాప్‌‌‌‌

ఉద్యోగులకు నచ్చిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ టాప్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలోని ఉద్యోగులను ఆకర్షిస్తున్న  కంపెనీల్లో  మైక్రోసాఫ్ట్ ముందుంది.  టీసీఎస్‌‌‌‌, అమెజాన్ ఆ తర్వాత ప్లేస్‌‌‌‌లలో ఉన్నాయి. రీసెర్చ్ సంస్థ రాండ్‌‌‌‌స్టాడ్‌‌‌‌ చేసిన సర్వే ప్రకారం,  మిగిలిన కంపెనీలతో  పోలిస్తే మైక్రోసాఫ్ట్‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌గా ఉందని,  పేరు ప్రఖ్యాతులు బాగున్నాయని, కెరీర్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు మంచి అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు. రాండ్‌‌‌‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఈబీఆర్) 2024 లిస్టులో మైక్రోసాఫ్ట్ హయ్యెస్ట్ స్కోర్ సాధించింది. 

టాప్ 10 లో  టీసీఎస్‌‌‌‌, అమెజాన్‌‌‌‌తో పాటు టాటా పవర్ (4 వ ర్యాంక్‌‌‌‌), టాటా మోటార్స్‌‌‌‌ (5), శామ్‌‌‌‌సంగ్ ఇండియా (6), ఇన్పోసిస్‌‌‌‌ (7), ఎల్ అండ్ టీ (8), రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ (9), మెర్సిడెజ్‌‌‌‌ బెంజ్‌‌‌‌ (10) ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద 6,084 కంపెనీల్లో  పనిచేస్తున్న 1,73,000 మంది అభిప్రాయాలను సేకరించి రాండ్‌‌‌‌స్టాడ్ ఈ సర్వే చేసింది. ఉద్యోగులు వర్క్‌‌‌‌–లైఫ్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, స్కిల్స్ ఉన్నవారిని నిలుపుకోవాలంటే కంపెనీలు కొత్తగా ఆలోచించాలని రాండ్‌‌‌‌స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్‌‌‌‌ పీఎస్ అన్నారు. 

గత ఏడాది కాలంగా  జాబ్స్‌‌‌‌ మారాలనే ఆలోచన ఉద్యోగుల్లో తగ్గిందని, అయినప్పటికీ కంపెనీలు బెనిఫిట్స్‌‌‌‌ను ఇవ్వడం ఆపొద్దని సలహా ఇచ్చారు. ట్యాలెంట్‌‌‌‌ను నిలుపుకోవాలంటే వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌‌‌‌, కెరీర్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు అవకాశాలు ఇవ్వడం, పని వాతావరణం ఫ్లెక్సిబుల్‌‌‌‌గా ఉండడంపై ఫోకస్ పెట్టాలని అన్నారు. ఆటో మోటివ్ సెక్టార్ ఉద్యోగులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. సుమారు 77 శాతం మంది ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారు.  ఐటీ,  కమ్యూనికేషన్‌‌‌‌, టెలికం, ఐటీఈఎస్‌‌‌‌ సెక్టార్ల వైపు76 శాతం మంది,  ఎఫ్‌‌‌‌ఎంసీజీ, డ్యూరబుల్స్‌‌‌‌, రిటైల్‌‌‌‌, ఈ–కామర్స్ వైపు 75 శాతం మంది,  ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌, కన్సల్టింగ్‌‌‌‌ వైపు 74 శాతం మంది ఆసక్తి చూపారు.

 

మరిన్ని వార్తలు