భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్ లలో వాయిస్ కాలింగ్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు టాటా కమ్యూనికేషన్స్మై క్రోసాఫ్ట్ తో సహకారం అదించ నుంది. భారత దేశంలోని ఎంటర్ ప్రైజెస్ కోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ లకు సహకారం, కనెక్టివిటీ సౌలభ్యాన్ని అందించేందుకు టాటా కమ్యూనికేషన్స్ మైక్రోసాఫ్ట్ తో తన భాగస్వామ్యాన్ని బుధవారం (ఫిబ్రవరి 7) ప్రకటించింది. ఇందులో భాగంగా ఎండ్ టు ఎండ్ మేనేజ్డ్ సర్వీసెస్ లేయర్ ను అందిస్తుంది. టీం అఆన్ బోర్డింగ్, డిప్లాయ్ మెంట్ , మేనేజ్ మెంట్, ఎండ్ పాయింట్ డివైజ్ లు , SBC(సెషన్ బార్డర్ కంట్రోలర్లు మెరుగుపర్చడం, వాటి వినియోగం, రెగ్యులేటరీ కంప్లయిన్స్ తో అన్ని కలిపి ఒకే ఫ్లాట్ ఫారమ్ లో అందించనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా, ఏ టీమ్ ల డివైజ్ లోనైనా ఆపరేటర్ కనెక్ట్ ఫ్లాట్ ఫారమ్ ఉపయోగించడం ద్వారా PSTN వాయిస్ కాల్ లను అంతరాయం లేకుండా అందించడానికి భారత్ లోని ఎంటర్ ప్రైజ్ కస్టమర్లతో పాటు దేశంలోని ఎంఎన్ సీ సంస్థలకు కూడా సర్వీస్ అందించనుందని టాటా కమ్యూనికేషన్స్ వర్గాలు తెలిపాయి. స్థానిక నిబంధనలు, కంప్లయిన్స్ తో కట్టుబడి వర్క్ ఫోర్స్ ఉత్పాదకత, సామర్థ్యాన్ని మరింత మెరుగు పర్చేందుకు ఆపరేటర్ కనెక్ట్ ఫర్ టీమ్స్ కు సహాయపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.