మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం.. 85 లక్షల డివైజ్‌లపై ఎఫెక్ట్

మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం.. 85 లక్షల డివైజ్‌లపై ఎఫెక్ట్

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపంపై ఆ సంస్థ తన బ్లాగ్ లో కీలక ప్రకటన చేసింది. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయిన క్రౌడ్‌స్ట్రైక్‌ చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వల్ల ఈ సాంకేతిక లోపం ఏర్పడిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం85 లక్షల విండోస్‌ డివైజ్‌లపై పడినట్టు వెల్లడించింది. తమ మొత్తం విండోస్‌ డివైజ్‌లలో ఇది ఒక శాతం కంటే తక్కువేనని సంస్థ పేర్కొంది.

 మైక్రోసాఫ్ట్‌ అజూర్‌లో సాంకేతిక లోపాన్ని సవరించేందుకు క్రౌడ్‌స్ట్రైక్‌ సాయం చేసినట్టు తెలిపింది. ఇందుకోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, గూగుల్‌ క్లౌడ్‌తో కూడా కలిసి పని చేశామని వెల్లడించింది. వినియోగదారుల అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నామని.. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.