హైదరాబాద్ నగరంలోపాటు నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఆదివారం (మే26) ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.నగరంలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు కమ్మేసి వాతావరణ చల్లగా మారింది. నగరం లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
వనస్థలిపురంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం సుష్మా చౌరస్తా వద్ద మన్సూరాబాద్ కు వెళ్లే మార్గంలో తెగిపడిన 11kv విధ్యుత్ వైరు తెగిపడింది. ఓ యువతికి తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వృక్షం కూలి ఓ కారుపై పడటంతో పూర్తి ధ్వంసమైంది..కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.
మరోవైపు ఘట్కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తో భారీ వర్షం.ఈ గాలివానకు ఘట్కేసర్ టు ఈసీఐఎల్ వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.
కర్మన్ ఘాట్, చంపాపేట, ఎల్బీ నగర్, నాగోల్, బంజారాహిల్స్ లలో వర్షం కురిసింది. మరోవైపు చైతన్యపురి, సైదాబద్ మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.