మధ్యాహ్న భోజనం బంద్.. ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు

కరీంనగర్ :  మిడ్ డే మీల్స్ కార్మికుల సమ్మెతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం బంద్ అయింది. దీంతో చాలా చోట్ల విద్యార్థులు ఇంటి నుంచే టిఫిన్  బాక్స్  తెచ్చుకుని తింటున్నారు. కార్మికులకు పెంచుతామన్న జీతం రూ.2 వేలు ఇవ్వాలని, పెండింగ్ మెస్ బిల్లులు, 9, 10వ తరగతి స్టూడెంట్ల కోడిగుడ్ల బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  టీఆర్ఎస్ కేవీ అనుబంధ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేస్తున్నా రు. దీంతో కొన్నిచోట్ల హెచ్ఎంలు, టీచర్లు పిల్లలకు భోజనాలు వండిస్తుండగా..  ఇలాంటి సౌకర్యం లేని చోట్ల విద్యార్థులు ఇంటి నుంచే భోజనాలు తెచ్చుకుంటున్నారు.