- సీఎం ప్రకటించినప్పటి నుంచి వేతనం ఎరియర్స్ ఇవ్వాలె
- మిడ్ డే మీల్స్ కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూకు తగినన్ని నిధులు కేటాయిస్తేనే, దాన్ని అమలు చేస్తామని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ తెలిపింది. అప్పటిదాకా పాత మెనూనే సర్కారు బడుల్లో అమలు చేయాలని కమిటీ డిసైడ్ అయింది. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేశ్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ మాట్లాడుతూ... జీతాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతూ ఇటీవల సమ్మె నిర్వహించామని, దీంతో కార్మికులకు పెరిగిన వేతనం ఈనెల నుంచి అమలు చేస్తామని మంత్రి ప్రకటించారన్నారు.
ALSO READ :ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్.. రాష్ట్ర కమిటీ ఎన్నిక
అయితే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి ఎరియర్స్ తో సహా చెల్లించాలన్నారు. పిల్లలకు అందించే గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించా లని కోరారు. లేకపోతే అంగన్ వాడీ సెంటర్లకు సప్లయ్ చేసినట్టుగా మిడ్ డే మీల్స్ స్కీమ్కూ సరఫరా చేయాలని కోరారు. పెరిగిన ధరలతో కొత్త మెనూ అమలు చేయడం కష్టమని తెలిపారు. మీటింగ్లో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుల్తాన్ బీ, సీహెచ్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు సరస్వతి, రాజేశ్వరి, సత్యనారాయణ, గోవర్ధన్, లక్ష్మి, కృష్ణమాచారి, స్వప్న, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.