పెద్దపల్లి, వెలుగు: కోడిగుడ్ల రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరారు. అప్పటిదాకా విద్యార్థులకు మిడ్ డే మీల్స్‌లో కోడిగుడ్లు అందించలేమన్నారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీల్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్పూసల రమేశ్మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మిడ్‌డే మీల్స్ మెనూ చార్జీలను పెంచాలన్నారు.
కార్మికులకు రూ. 18 వేలు కనీసం వేతనంగా చెల్లించాలన్నారు. అంగన్‌వాడీలకు ఇస్తున్నట్లుగానే తమకు కూడా నిత్యావసర వస్తువులు, వంటపాత్రలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు పాఠకుల కళావతి, చింతమల లక్ష్మి, ఎండీ అంజు, జంగం లక్ష్మి, పి సునీత, ఎస్ సరోజన తదితరులు పాల్గొన్నారు.