- ఖర్చు తానే భరిస్తానని ప్రకటించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: వివిధ కారణాలతో కాలేజీకి వచ్చే ఇంటర్ స్టూడెంట్స్ మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఈ నెల 3 నుంచి నియోజక వర్గంలోని జడ్చర్ల బాలికల, బాలుర కాలేజీలతో పాటు బాలానగర్, యన్మనగండ్ల, మిడ్జిల్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ స్టూడెంట్స్‌కు తన సొంత ఖర్చులతో మిడ్ డే మీల్స్ అమలు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ఐదు కాలేజీల్లో చదువుతున్న 1,300 మంది విద్యార్థుల ఆకలి తీర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదిలాఉంటే తన జన్మదినం సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీటి సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలాఉంటే ఎమ్మెల్యే తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని 1,300 మంది ఇంటర్ స్టూడెంట్స్‌కు మిడ్ డే మీల్స్ పెడతానని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.