- వెలుగు కథనానికి స్పందన
లింగంపేట,వెలుగు : లింగంపేట మండలంలోని మెంగారంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్పిల్లలకు గురువారం మిడ్డే మీల్స్షురూచేశారు.'రెండు నెలలుగా పొయ్యి వెలగలే' శీర్షికతో ఈ నెల 5న వెలుగు వార్త ప్రచురించింది. స్పందించిన ఎంఈవో రామస్వామి, స్కూల్హెడ్మాస్టర్ మోహన్ఏజెన్సీ నిర్వహకురాలు బాలరాజవ్వను మాట్లాడి వంట చేయడానికి ఒప్పించారు.
దీంతో గురువారం స్కూల్ స్టూడెంట్స్కు ఆలు, టమాటా కూరతో మధ్యాహ్న భోజనం వడ్డించారు. స్కూల్లో భోజనం షురూ చేయడంతో పేరెంట్స్హర్షం వ్యక్తం చేశారు.