పెండింగ్ బిల్లులు చెల్లించాలని..మిడ్​డే మీల్స్​ వర్కర్ల ధర్నా

సిరిసిల్ల టౌన్, వెలుగు:  పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పెంచిన వేతనాలను అమలుచేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట  మిడ్​డే మీల్స్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడుతూ బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వంట చేస్తున్నామన్నారు. వంట సరుకులు, కోడి గుడ్లు, సిలిండర్ల ధరలు పెరిగాయని, వాటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్​చేశారు. అనంతరం ఏవో గంగయ్య కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కార్మికులు ఎల్లవ్వ, లక్ష్మి, ఏఐటీయూసీ లీడర్లు అజ్జ వేణు, లక్ష్మణ్‌‌, రాజేశ్వరి పాల్గొన్నారు.