13 టీఎంసీలకు మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

13 టీఎంసీలకు మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బోయినిపల్లి, వెలుగు : రాజన్నసిరిసిల్ల బోయినిపల్లి మండలంలోని మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మానేర్(శ్రీ రాజరాజేశ్వర) ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13.014 టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మిడ్మానేరు గేట్లను ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు పరిశీలించారు. రామడుగు మండలం  లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంప్ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వరద కాలువ ద్వారా 12,600 క్యూసెక్కులు, మానేరు, మూలవాగు ద్వారా 1890 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.  మిడ్ మానేర్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోగానే ఎల్ఎండీ కి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

విలాసాగర్ చెరువుకు నీటి విడుదల 

బోయినిపల్లి మండలంలోని విలాసాగర్ చెరువుకు వరద కాలువ నుంచి నీటిని ఎత్తి పోస్తున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు పంట పొలాలకు రెండు మోటార్ల  ద్వారా చెరువులోకి నీటిని లిఫ్ట్ చేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు.