అర్ధరాత్రి సర్క్యులర్.. బ్యాలెట్ పై ఏ ముద్ర ఉన్నా ఓటు చెల్లుతుంది

అర్ధరాత్రి సర్క్యులర్.. బ్యాలెట్ పై ఏ ముద్ర ఉన్నా ఓటు చెల్లుతుంది

స్వస్తిక్ తోపాటు ఏ మార్క్ ఉన్నా పరిగణనలోకి తీసుకోవాలన్న ఎస్ఈసీ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కిం పు సందర్భంగా బ్యాలెట్ పేపర్ పై స్వస్తి క్ ముద్రతో పాటు మరే ఇతర ముద్రలు(మార్క్​ లు) ఉన్నా
ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గురువారం అర్ధరాత్రి ఈ మేరకు హడావుడిగా సర్క్యు లర్ జారీ చేసింది. కౌంటింగ్ అబ్జర్వర్లతో గురువారం కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కొందరు పరిశీలకులు ఓట్ల చెల్లుబాటు గురించి సందేహాలు లేవనెత్తారని పేర్కొంది. కొన్ని పోలింగ్ బూతు ల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఓటు వేసేందుకు ఓటర్లకు స్వస్తిక్ చిహ్నంతో ఉన్న ముద్ర కాకుండా ఇతర ము ద్ర ఉన్న స్టాం ప్ ఇచ్చినట్లు పరిశీలకులు చెప్పారని పేర్కొంది. సాధారణంగా స్వస్తిక్ ముద్ర ఉన్న ఓటు మాత్రమే చెల్లు బాటు అవుతుందని అనుకుంటారని, ఆ ము ద్రకు బదులుగా వేరే ము ద్ర
ఉన్నా కూడా సరైన ఓటుగానే గుర్తించాలని రిటర్నింగ్ ఆఫీసర్లను ఆదేశించింది. వేరే ముద్ర ఎలా వచ్చింది బ్యాలెట్ విధానం లో పోలింగ్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్న ఈసీ పోలిం గ్ స్టే షన్ల సంఖ్యకు సరిపడా స్వస్తిక్ ముద్ర ఉన్న స్టాంపులు అందజేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా ఇతర ము ద్రలు అందజేసి ఉంటే ఆ విషయం ముందే ప్రకటిం చాల్సి ఉంది. కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభమవాల్సి ఉండగా హడావుడి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి .

సర్క్యులర్ కాపీ…

1192-2020,Lr.Clarifi-Counting of Votes