వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. అర్థరాత్రి సడన్ గా కరెంట్ పోవడంతో దాదాపుగా గంటకు పైగా రోగులు ఇబ్బంది ఎదురుకున్నారు. కరెంట్ పోవడంతో పాటుగా జనరేటర్ కూడా పని చేయకపోవడంతో సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఆక్సిజన్ పేషంట్ల అవస్థలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. కేబుల్స్ బర్న్ కావడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి నుంచి పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏఎంసీ , బర్నింగ్ వార్డు, సర్జికల్ వార్డుల్లో పవర్ కట్ అయింది. దాదాపు గంట తర్వాత కరెంట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.