షటర్ ​పగులగొట్టి వైన్స్​లో దొంగతనం

  • రూ.1.23 లక్షల మద్యం బాటిళ్ల చోరీ

నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండల కేంద్రంలోని వరుణ్ లిక్కర్ మార్ట్​లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి షటర్ పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కౌంటర్​లో ఉన్న రూ.8,050 నగదు, రూ.1,23,360 విలువచేసే మద్యం బాటిళ్లతో ఉడాయించారు. ఆదివారం ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన వైన్స్ యజమానులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును, సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృశ్యాలను పరిశీలించారు. ముగ్గురు దుండగులు ముఖానికి మాస్కులు పెట్టుకొని వైన్స్​లోకి చొరబడినట్లు చోరీ చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.