
పద్మారావునగర్, వెలుగు: నవజాత శిశువుల సంరక్షణ, మెడికల్ కేర్ లో మిడ్‌వైఫ్‌ల పాత్ర కీలకమని పలువురు వైద్యనిపుణులు అన్నారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి మదర్ ఆండ్ చైల్డ్ సంరక్షణ విభాగంలో సొసైటీ ఆఫ్ మిడ్‌వైఫ్ ఇండియా (సోమి), హిమాలయా బేబీకేర్ సెంటర్, గాంధీఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఎసెన్సియల్ న్యూబర్న్ కేర్ అంశంపై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు.
శిశువు ఆరోగ్యం, సంరక్షణ తదితర విషయాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేసి, సర్టిఫికెట్లు ఇచ్చారు. చేశారు. కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ మిడ్‌వైఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శాంతి విక్టోరియారాణి, కోఅర్డినేటర్ సంధ్యారాణి, గాంధీ గైనకాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ రాధ పాల్గొన్నారు.