వరంగల్ జిల్లాలో వలస కూలీలు ఆత్మహత్య

వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం జరిగింది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తితో పాటు చిన్నారి ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ నుంచి 20 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం గొర్రెకుంట గ్రామానికి వచ్చారు. వీరంతా స్థానికంగా ఉన్న గోనె సంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తు  జీవనం గడుపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి కూడా పోయే వీలు లేక వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గీసుగొండ పోలీసులు నలుగురి మృతదేహలు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.