కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా, తాజాగా ఎంఐఎంకు చెందిన35వ వార్డు కౌన్సిలర్ ఫౌజియా జాఫర్ అహ్మద్ శనివారం పార్టీ మారారు. నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ రూర‌‌ల్ అంకోలి, తంతోలి, సొసైటీ గూడ, క‌‌చ్ కంటి, జైన‌‌థ్ మండ‌‌లం సాంగ్వి, క‌‌రంజి గ్రామాల‌‌కు చెందిన యువకులు సైతం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ ఉన్నారు. 

లక్సెట్టిపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి పనిచేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం రాత్రి మండలంలోని తిమ్మాపూర్ లో బీఆర్ఎస్ కు చెందిన గ్రామ మాజీ సర్పంచ్ బియ్యాల సుధాకర్, వార్డు మెంబర్లు బైరి లక్ష్మి, శంకరయ్యతో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్​లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు తిరుపతి, గడ్డం త్రిమూర్తులు, పింగళి రమేశ్​తదితరులు పాల్గొన్నారు.

జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని సోనాపూర్, బంగారు తండాలకు చెందిన 50 మంది బీఆర్ఎస్ లీడర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ సమక్షంలో కాంగ్రెస్ చేరారు.