హైదరాబాద్, వెలుగు: మిలాద్ -ఉన్ -నబి ప్రదర్శనలను సెప్టెంబరు 19వ తేదీన నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 16న మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్ కమిటీ నిర్ణయించింది. మిలాద్ ఉన్ నబి ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా సెప్టెంబరు 7 నుంచి గణేశ్ నవరాత్రులు మొదలు అవుతాయని, 17న నిమజ్జనం ఉన్న విషయం చర్చకు వచ్చింది. దీంతో మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం, మంత్రులు మిలాద్ కమిటీ సభ్యులకు సూచించారు. చర్చించే బాధ్య తను మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మిలాద్ కమిటీ సభ్యుల కు అప్పగించారు. చర్చల అనంతరం ప్రదర్శన వా యిదా వేయాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరగా.. కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు.