హైదరాబాద్, వెలుగు: మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని అన్నారు.
శాంతి, సోదరభావం, కరుణ, ధర్మబద్ధ జీవనాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచానికి దిక్సూచి లాంటివని సీఎం తెలిపారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ప్రజా పాలనలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని, ముస్లింల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.