
కాశీబుగ్గ/నర్సంపేట, వెలుగు : మిలాద్ ఉన్ నబీ వేడుకలను గురువారం వరంగల్, నర్సంపేటలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ శంభునిపేటలో ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు.
25వ డివిజన్ మండిబజార్‌లో జరిగిన వేడుకలకు మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. అలాగే నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డు దర్గా నుంచి అంగడి సెంటర్, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా జామే మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు