తన దగ్గర బాంబ్ ​ఉందంటూ ఫ్లైట్​లో ఓ వ్యక్తి హల్​చల్​

  • టేకాఫ్​ అయ్యే టైంలో పెద్దగా కేకలు   నిలిచిపోయిన బ్యాంకాక్ ​విమానం

శంషాబాద్, వెలుగు: బ్యాంకాక్​వెళ్లే విమానం ఎక్కిన ఓ వ్యక్తి తన వద్ద బాంబ్​ఉందంటూ హల్​చల్​చేశాడు. టేక్​ఆఫ్​అయ్యే టైంలో పెద్దగా కేకలు వేయడంతో పైలెట్​అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశాడు. సమాచారం అందుకున్న ఎయిర్​పోర్టు అధికారులు సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇతర సిబ్బందిని రంగంలోకి దింపి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు.

ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబ్​బెదిరింపు కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని తిరిగి బ్యాంకాక్ పంపించారు. నిందితుడు విజయవాడకు చెందిన సుధాకర్(38)గా పోలీసులు గుర్తించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.