మిలిట‌‌‌‌రీ కాలేజీలో అడ్మిషన్స్​.. టీఎస్పీఎస్సీ ద్వారా అప్లికేషన్స్

డెహ్రాడూన్​లోని రాష్ట్రీయ ఇండియ‌‌‌‌న్ మిలిట‌‌‌‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జ‌‌‌‌న‌‌‌‌వ‌‌‌‌రి 2023 ట‌‌‌‌ర్మ్‌‌‌‌ ఎనిమిదో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తిలో అడ్మిషన్స్​కు తెలంగాణ‌‌‌‌కు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్ ప‌‌‌‌బ్లిక్ స‌‌‌‌ర్వీస్ క‌‌‌‌మిష‌‌‌‌న్(టీఎస్‌‌‌‌పీఎస్సీ) అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత‌‌‌‌: ఏడో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి చదువుతున్న లేదా ఏడో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. వ‌‌‌‌య‌‌‌‌సు 1 జనవరి 2023 నాటికి ప‌‌‌‌ద‌‌‌‌కొండున్నర ఏళ్లకు త‌‌‌‌గ్గకుండా ప‌‌‌‌ద‌‌‌‌మూడేళ్లకు మించ‌‌‌‌కుండా ఉండాలి.రాత ప‌‌‌‌రీక్ష, వైవా వాయిస్‌‌‌‌, మెడిక‌‌‌‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: రాత ప‌‌‌‌రీక్షలో మొత్తం మూడు పేప‌‌‌‌ర్లు ఉంటాయి.  మ్యాథ్స్​, జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ నాలెడ్జ్, ఇంగ్లిష్. ఇందులో మ్యాథ్స్​ 200 మార్కుల‌‌‌‌కు, జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ నాలెడ్జ్ 75 మార్కుల‌‌‌‌కు, ఇంగ్లిష్ 125 మార్కుల‌‌‌‌కు ఉంటుంది. 

అప్లికేషన్​ ప్రాసెస్​: విద్యార్థులు ఆఫ్‌‌‌‌లైన్​లో  ఏప్రిల్​ 25లోగా అప్లై చేసుకోవాలి.  అభ్యర్థులు అప్లికేషన్స్​ పంపాల్సిన అడ్రస్​ –  తెలంగాణ స్టేట్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (టీఎస్‌‌‌‌పీఎస్సీ), నాంపల్లి,  హైదరాబాద్‌‌‌‌, తెలంగాణ-500001. ఎగ్జామ్​ జూన్​ 4న నిర్వహిస్తారు.

వెబ్​సైట్: www.tspsc.gov.in