నైగర్​లో సైనిక తిరుగుబాటు.. అధ్యక్షుడి అరెస్టు, రాజ్యాంగం రద్దు

నియామి: పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌‌‌‌లో సైన్యం తిరుగుబాటు చేసింది. బుధవారం రాత్రి అధ్యక్షుడి నివాసాన్ని చుట్టుముట్టి ప్రెసిడెంట్ బజౌమ్, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేసింది. తర్వాత కల్నల్ మేజర్ అమదౌ బద్రామనె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. దేశంలో భద్రత క్షీణించడం, ఆర్థికంగా, సామాజికంగా బలహీన పరిపాలన నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశంలోని అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని, సరిహద్దులను కూడా మూసివేసినట్టు తెలిపారు. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. బజౌమ్ మద్దతుదారులు ప్రెసిడెంట్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించగా గార్డ్స్ అడ్డుకున్నారు.  నైగర్‌‌‌‌లో సైన్యం తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్, అమెరికా,  ఫ్రాన్స్, ఆఫ్రికా యూనియన్ ఖండించాయి.   

ALSO READ:వానలకు పలు రైళ్ల రద్దు.. 40 రైళ్ల దారి మళ్లింపు