నిజామాబాద్​లో మిలటరీ ఇంజనీర్ల పర్యటన

నిజామాబాద్​లో మిలటరీ ఇంజనీర్ల పర్యటన
  •  ఈ నెల 8 వరకు ఫీల్డ్​ విజిట్​ 

    
నిజామాబాద్, వెలుగు:
సెంట్రల్​ గవర్నమెంట్​పరిధిలోని 30 మంది మిలటరీ ఇంజనీర్ల టీం శనివారం జిల్లా స్టడీ కోసం వచ్చారు. తన ఛాంబర్​లో వారితో సమావేశమైన అడిషనల్​కలెక్టర్​ అంకిత్​ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని వారికి తెలిపారు. 70 నుంచి 80 శాతం మంది ప్రజలు అగ్రికల్చర్​ ఆధారంగా జీవనం సాగిస్తున్నారని విలేజ్​, మండలం, డివిజన్, జిల్లా  కేంద్రాల్లో ఇక్కడి అధికారులు పనిచేస్తారని వివరించారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు, అలీసాగర్ లిఫ్టు, గోదావరి నది ఆధారంగా వరి, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న ఎక్కువగా సాగవుతాయన్నారు. 30 మంది మిలటరీ ఇంజినీర్లను ఐదుగురి చొప్పున గ్రూప్​గా వేరు చేసి ఒక్కో విలేజ్​కు ఫీల్డ్​ విజిట్​కోసం ఎంపిక చేశారు. ఈ నెల 8 వరకు కొనసాగే వీరి టూర్​కు మండల ఆఫీసర్లు సహకరించాలని ఆదేశించారు. డీఆర్డీవో పీడీ సాయాగౌడ్​, విజయేందర్​రెడ్డి తదితరులు ఉన్నారు.